Food Safety ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండిలా

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 09:38 AM IST
Food Safety ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండిలా

Updated On : March 9, 2019 / 9:38 AM IST

ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ విభాగంలో ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 దరఖాస్తు చివరితేది, అభ్యర్థులు మార్చి 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి. 

 Online Application కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

విద్యా అర్హత:
– సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
వయసు పరిమితి:
18-42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. SC, ST, BC, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.  

ఎంపిక విధానం: 
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ఆధారంగా స్క్రీనింగ్ పరీక్ష తేదీలను వెల్లడించనున్నారు. మెయిన్ పరీక్షను మే 22న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా, స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.