BOB Recruitment 2025: గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల.. డైరెక్ట్ లింక్ తో ఇలా అప్లై చేసుకోండి
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) రిటైల్ లయబిలిటీస్, రూరల్ & అగ్రి బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 417 రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Bank of Baroda has released a notification for the recruitment of 417 posts.
చదువు కంప్లీట్ చేసి బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) రిటైల్ లయబిలిటీస్, రూరల్ & అగ్రి బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 417 రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన ఆన్లైన్ దరకాస్తు ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 26 వరకు కొనసాగనుంది. కాబట్టి.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, ఖాళీల వివరాలు:
సేల్స్ విభాగంలో మేనేజర్ పోస్టులు 227 ఉన్నాయి.
వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 24 ఏళ్ళ నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే మార్కెటింగ్, సేల్స్/బ్యాంకింగ్‌లో MBA/PGDM చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్‌లో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి. రిటైల్ లయబిలిటీస్‌లో అనుభవం కలిగిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది.
అగ్రి సేల్స్ విభాగంలో ఆఫీసర్ పోస్టులు 142 ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 24 ఏళ్ళ నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.
అగ్రికల్చర్/సంబంధిత రంగంలో 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సేల్స్, మార్కెటింగ్ లేదా రూరల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అగ్రి సేల్స్‌లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్/ఇన్సూరెన్స్ (BFSI)లో ఉంటే మంచిది.
అగ్రి సేల్స్ మేనేజర్ పోస్టులు 48 ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు 26 ఏళ్ళ నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆఫీసర్ అగ్రి సేల్స్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం తప్పనిసరి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ / ఇన్సూరెన్స్ (BFSI) ఉంటే తగిన ప్రాధాన్యత లభిస్తుంది. అగ్రి సేల్స్‌లో కనీసం 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, SC/ST/PwD/ మాజీ సైనికులు/ మహిళల అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ముందుగా అభ్యర్థులను ఎలిజిబిలిటీ, ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత ఆన్‌లైన్ ఎగ్జామ్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in లోకి వెళ్ళాలి
- కెరీర్స్ సెక్షన్ లో కరెంట్ ఆపర్చునిటీస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- BOB/HRM/REC/ADVT/2025/11 రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
- తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నెచర్, ఐడీ, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి ఫీజు చెల్లించాలి
- తరువాత సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దీన్ని ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.