Recruitment Notification : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు పోస్టుల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

Bank of Maharashtra is filling up various posts
Recruitment Notification : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 551 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పుణెలోని ప్రధాన కార్యాలయంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి ఏజీఎం బోర్డ్ సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్ 1, ఏజీఎం- డిజిటల్ బ్యాంకింగ్ 1, ఏజీఎం- నిర్వహణ సమాచార వ్యవస్థ 1, చీఫ్ మేనేజర్- ఎంఐఎస్ 1, చీఫ్ మేనేజర్- మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ 1, చీఫ్ మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్ 02, చీఫ్ మేనేజర్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ 1, చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ 1, చీఫ్ మేనేజర్- క్రెడిట్ 15, చీఫ్ మేనేజర్- డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 1, చీఫ్ మేనేజర్- పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్ 1, జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-2 400, జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-3 100, ఫారెక్స్/ ట్రెజరీ ఆఫీసర్ 25 ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 23-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bankofmaharashtra.in/ పరిశీలించగలరు.