Best Career Options: చదువుతో సంబంధంలేదు.. ఈ పనులు చేస్తూ ఫుల్లుగా సంపాదిస్తున్నారు.. బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ మీకోసం
జీవితంలో ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి చదువే అవసరం లేదు. చాలా మంది ఈ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేశారు.

Best career options
జీవితంలో ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి చదువే అవసరం లేదు. చాలా మంది ఈ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేశారు. కాబట్టి, చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే సహాయపడుతుంది. మనల్ని విజయాపథంలో నడిపించేది ఎప్పుడు మన కృషి, పట్టుదలే. స్కిల్స్, ట్రైనింగ్, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చదువుతో సంబంధం లేకుండా కూడా మంచి కెరీర్ ని పప్లాన్ చేసుకోవచ్చు. మరి ఆ కెరీర్ ఆప్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వెబ్ డెవలపర్:
వెబ్ డెవలపర్లు వెబ్‌సైట్‌లు, యాప్‌లు క్రియేట్ చేయవచ్చు. దీనికి సంబందించిన కోడింగ్ బూట్ క్యాంప్‌లు ట్యుటోరియల్స్ లేదా ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. దీనికి ఎలాంటి పోర్టిఫోలియో అవసరం లేదు. మీ డిగ్రీని కూడా ఎవరు అడగరు.
డిజిటల్ మార్కెటర్:
ఇప్పుడు ఫ్యూచర్ అంతా డిజిటల్ మార్కెటర్లదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు సోషల్ మీడియాలో యాడ్స్, SEO ద్వారా ఆన్‌లైన్‌లో వ్యావార అభివృద్ధికి సహాయపడతారు. కాబట్టి ఫ్యూచర్ అంతా వీరి చేతుల్లోనే నడవనుంది. దీనికి సంబందించి మీరు ఆన్‌లైన్ కోర్సులు తీసుకోవచ్చు. మీకు ఉండాల్సింది కేవలం క్రియేటివిటీ, స్ట్రాటజీ. దీనికి ఎలాంటి చదువు అవసరం లేదు.
సేల్స్ రిప్రజెంటేటివ్:
ఇది కూడా మంచి కెరీర్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీనికి ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. కేవలం ప్రొడక్టు నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పటికే చాలా మంది ఈ పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అనుభవం పెరిగేకొద్దీ పొజిషన్స్ కూడా మారే అవకాశం ఉంది.
న్యూట్రిషన్ కోచ్:
న్యూట్రిషన్ కోచ్ ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది తమ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది అని తెలుసుకోవడానికి తినడానికి న్యూట్రిషన్ కోచ్ లను ఎంచుకుంటున్నారు. దీనికి కూడా ఎలాంటి చదువు అవసరం లేదు. కేవలం సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేస్తే చాలు.
ఇవే కాకుండా మేకప్ ఆర్టిస్ట్, ఎలక్ట్రీషియన్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్లంబర్, కార్పెంటర్, ఎలివేటర్/ఎస్కలేటర్ టెక్నీషియన్, HGV/LGV డ్రైవర్ ఇలా చాలా రకాల పనులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేనికి కూడా చదువు అవసరం లేదు. కానీ, వీరికి ప్రెజెంట్ చాలా డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా నగరాల్లో వీరు మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. కాబట్టి, చదువుకొని వాళ్ళు ఇలాంటి వాటిలో తమ కెరీర్ ను స్టార్ట్ చేయడం మంచిది.