JEE 2025: JEE మెయిన్స్‌లో 70-80% పర్సంటైల్ వచ్చిందా? నిరాశ వద్దు! మీకోసం ఉత్తమ కాలేజీలు, సరైన గైడెన్స్ ఇక్కడ.

మీ పర్సంటైలే మీ ర్యాంక్‌ను సూచిస్తుంది. దీనిని అర్థం చేసుకుంటే మీకున్న అవకాశాలపై ఒక స్పష్టత వస్తుంది.

JEE 2025: JEE మెయిన్స్‌లో 70-80% పర్సంటైల్ వచ్చిందా? నిరాశ వద్దు! మీకోసం ఉత్తమ కాలేజీలు, సరైన గైడెన్స్ ఇక్కడ.

best engineering colleges for jee mains

Updated On : June 19, 2025 / 3:50 PM IST

JEE మెయిన్స్‌లో 70 నుండి 80 పర్సంటైల్ మధ్య స్కోర్ సాధించారా? NITs లేదా IITs లో సీటు రాలేదని నిరాశ చెందుతున్నారా? కంగారు పడకండి. ఇది ముగింపు కాదు, మీ ఇంజినీరింగ్ కెరీర్‌కు ఇది ఒక కొత్త ఆరంభం కావచ్చు. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్-టు-బి-యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు ఈ పర్సంటైల్ స్కోర్‌తో అడ్మిషన్లు అందిస్తున్నాయి.

ముందుగా పర్సంటైల్, ర్యాంక్ అంటే ఏంటో తెలుసుకుందాం

మీ పర్సంటైలే మీ ర్యాంక్‌ను సూచిస్తుంది. దీనిని అర్థం చేసుకుంటే మీకున్న అవకాశాలపై ఒక స్పష్టత వస్తుంది. పర్సంటైల్ అంటే మీ కంటే తక్కువ స్కోర్ చేసిన విద్యార్థుల శాతం. దానికి సంబందించిన చిన్న వివరణ మీకోసం.

80 పర్సంటైల్ 2,20,000 – 2,40,000
75 పర్సంటైల్ 2,75,000 – 3,00,000
70 పర్సంటైల్ 3,30,000 – 3,60,000

70-80 పర్సంటైల్‌తో అడ్మిషన్ ఇచ్చే ప్రముఖ కాలేజీలు

యూనివర్సిటీ పేరు ప్రాంతం ఫీజు (సుమారు)
GITAM University హైదరాబాద్ / విశాఖపట్నం రూ. 2.7 లక్షల నుంచి డీమ్డ్ యూనివర్సిటీ, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, CSE/IT బ్రాంచ్‌లకు ప్రసిద్ధి
Quantum University రూర్కీ, ఉత్తరాఖండ్ రూ. 1.10 లక్షలు టెక్నాలజీ-ఫోకస్డ్ కరికులమ్, మంచి ఫ్యాకల్టీ
Amity University జైపూర్ / ఇతర క్యాంపస్‌లు రూ. 1.5 లక్షల నుంచి బలమైన ఇండస్ట్రీ కనెక్షన్లు, వైవిధ్యమైన కోర్సులు
Maharishi Markandeshwar University అంబాలా, హర్యానా రూ. 1.42 లక్షలు మంచి ల్యాబ్ సౌకర్యాలు, డీమ్డ్ యూనివర్సిటీ హోదా
Siksha ‘O’ Anusandhan (SOA) భువనేశ్వర్, ఒడిశా రూ. 2.35 లక్షలు NIRF ర్యాంకింగ్స్‌లో స్థానం, బలమైన రీసెర్చ్ ఫోకస్
University of Petroleum & Energy Studies (UPES) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రూ. 3.5 లక్షల నుంచి పెట్రోలియం, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక కోర్సులకు ప్రసిద్ధి

ఇతర మంచి కాలేజీలు:

ఆర్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్, జైపూర్

సింబయోసిస్ యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ఇండోర్

గ్లోకల్ యూనివర్శిటీ, సహారన్‌పూర్

హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై

మార్వాడీ యూనివర్శిటీ, రాజ్‌కోట్

ర్యాంక్ కి తగ్గట్టుగా సరైన కాలేజీని ఎలా ఎంచుకోవాలి?

తక్కువ పర్సంటైల్ వచ్చిందని ఏదో ఒక కాలేజీలో చేరడం పెద్ద పొరపాటు. ఈ అంశాలను పరిగణంలోకి తీసుకోండి.

NIRF ర్యాంకింగ్ & అక్రిడిటేషన్: మీరు చేరాలనుకుంటున్న కాలేజీకి NAAC (A, A+ గ్రేడ్) లేదా NBA అక్రిడిటేషన్ ఉందో లేదో చూడండి. ఇది నాణ్యమైన విద్యను సూచిస్తుంది.

ప్లేస్‌మెంట్ రికార్డులు: కేవలం టాప్ ప్యాకేజీలు కాకుండా, యావరేజ్ ప్యాకేజీ ఎంత? ఎంత శాతం మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారు? ఏ ఏ కంపెనీలు వస్తున్నాయి? అనే వివరాలు తెలుసుకోండి.

బ్రాంచ్ vs కాలేజ్: ఒక టాప్ కాలేజీలో ఆసక్తి లేని బ్రాంచ్ లో చేరడం కంటే కంటే, మంచి కాలేజీలో మీకు ఇష్టమైన బ్రాంచ్ ఎంచుకోవడం మంచిది.

ఫీజు, ఇతర ఖర్చులు: ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్, రవాణా, ఇతర ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోండి.

అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మండి: ఏజెంట్లు అనధికారిక వెబ్‌సైట్లు కాకుండా సమాచారం కోసం కాలేజీ అధికారిక వెబ్‌సైట్‌ ను సంప్రదించడం మంచిది.

JEE స్కోరు లేకుండా డైరెక్ట్ అడ్మిషన్:

ముఖ్య గమనిక కొన్ని కాలేజీలు 12వ తరగతి మార్కులు లేదా సొంత ప్రవేశ పరీక్ష ఆధారంగా డైరెక్ట్ అడ్మిషన్లు ఇస్తాయి. ఇది మంచి ఆప్షన్ అయినప్పటికీ, చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆ కాలేజీకి AICTE ఆమోదం ఉందో లేదో చుడండి. ప్లేస్‌మెంట్ల గురించి ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దు. పూర్వ విద్యార్థులని అడిగి తెలుసుకోండి. డబ్బు చెల్లించే ముందు కాలేజీని సందర్శించి, సౌకర్యాలను స్వయంగా పరిశీలించండి. JEE పర్సంటైల్ అనేది మీ సామర్థ్యానికి పూర్తి కొలమానం ఎప్పటికీ కాదు. సరైన జాగ్రత్తలు వహించి మంచి కాలేజీని ఎంచుకొండి.