Railway Recruitment: ట్రైనింగ్ లోనే రూ.84 వేల జీతం.. రైల్వేలో జాబ్స్.. 2,418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
రైల్వేలో కెరీర్ సెట్ చేసుకుందాం అంటుకుంటున్నారా? అయితే(Railway Recruitment) ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ముంబయిలోని రైల్వే

Railway Recruitment Cell in Mumbai has released a notification for 2,418 Act Apprentice posts.
Railway Recruitment: రైల్వేలో కెరీర్ సెట్ చేసుకుందాం అంటుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్(Railway Recruitment) ద్వారా సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,418 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 11వ తేదీతో ముగియనుంది.
ట్రేడుల వివరాలు:
వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, పెయింటర్, మెకానిక్.
విద్యార్హత:
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 12-08-2025 నాటికి 15 ఏళ్ళ నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు నెలకు రూ.7,000 స్టైపెండ్ అందుతుంది.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అందరు అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.