TG Inter Admissions: తెలంగాణ ఇంటర్ అడ్మిషన్స్: ఇవాళే లాస్ట్ డేట్.. కొనసాగుతున్న సెకండ్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్

తెలంగాణలో ఈ విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ అడ్మిషన్స్ (TG Inter Admissions)ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే

TG Inter Admissions: తెలంగాణ ఇంటర్ అడ్మిషన్స్: ఇవాళే లాస్ట్ డేట్.. కొనసాగుతున్న సెకండ్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్

TG Inter Admissions: Today is the last date for Telangana Inter Second Phase Admissions.

Updated On : August 31, 2025 / 10:21 AM IST

TG Inter Admissions: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ అడ్మిషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తవగా.. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే.. అడ్మిషన్స్ ప్రక్రియ(TG Inter Admissions) ఇవాళ్టితో అంటే ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. అలాగే ఇదే లాస్ట్ ఛాన్స్ అవడం విశేషం. కాబట్టి, విద్యార్థులు వెంటనే అడ్మిషన్స్ తీసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్, ఇతర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆగస్టు 31 లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది. ఇక రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. రెగ్యూలర్ విద్యార్థులతో పాటు డిప్లోమా వంటి పలు కోర్సుల్లో సీటు రానివారు లేదా ఇతర కారణాల వల్ల జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు.