DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పు.. కారణం ఏంటంటే..

హాల్ టికెట్లు డీఎస్సీ వెబ్ సైట్ లో ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పు.. కారణం ఏంటంటే..

Updated On : June 14, 2025 / 10:04 PM IST

DSC Exams: డీఎస్సీ పరీక్షల అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు చేసింది ప్రభుత్వం. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను.. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ యోగా డే కారణంగా పరీక్షల తేదీల్లో మార్పు చేసింది ప్రభుత్వం. హాల్ టికెట్లు డీఎస్సీ వెబ్ సైట్ లో ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ నెల 21న రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పరీక్ష తేదీలను మార్చినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం నిర్వహించాలని తలపెట్టింది. 21న విశాఖలో యోగా డే నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని రాకకు 2 రోజుల నుంచే రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేయనున్నారు. భారీ బందోబస్తు కల్పించనున్నారు.

Also Read: ఇంటర్ అయిపోయిందా.. బీటెక్, మెడిసిన్ మాత్రమే కాదు.. ఈ చదువులు చదివితే లక్షల్లో జీతాలు..

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు. ఇక, అధికార యంత్రాంగం అంతా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటుంది. రవాణ సౌకర్యం తక్కువగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలు పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు చేసింది సర్కార్. జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించింది.

పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు, మార్పు చేసిన హాల్ టికెట్లను https://apdsc.apcfss.in లో 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని మెగా డీఎస్సీ కన్వీనర్​ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్ధులు మార్పు చేసిన హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసు్కుని దాని ప్రకారం పరీక్షలకు హాజరు కావాలన్నారు.