అమెరికా అంతర్జాతీయ సదస్సుకు బొల్లారం విద్యార్థులు

అమెరికా అంతర్జాతీయ సదస్సుకు బొల్లారం విద్యార్థులు

Updated On : February 9, 2019 / 7:17 AM IST

అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బొల్లారం విద్యార్థులు అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేలా చేసింది. అమెరికా నాసాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో మేలో జరిగే సదస్సుకు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు ఈ విషయం తెలిపారు. 

అమెరికాకు చెందిన గో ఫర్ గురు అనే సంస్థ ఆస్ట్రోనాట్ మెమోరియల్ ఫౌండేషన్, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థతో కలిసి గతేడాది డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించిందని పేర్కొన్నారు. కల్పనాచావ్లా- మై ఇన్‌స్పిరేషన్, అబ్దుల్ కలాం-మై హీరో అనే అంశాలపై వ్యాసాలు రాసి ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో తమ విద్యార్థులు అంతరిక్ష సదస్సుకు ఎంపికైనట్లు వెల్లడించారు.