BECIL Recruitment : బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీకామ్‌, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

BECIL Recruitment : బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Career Opportunity

Updated On : March 28, 2023 / 2:42 PM IST

BECIL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెహ్రాదూన్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయి, హల్ద్‌వనిలోని పవన్‌హాన్స్‌ లిమిటెడ్‌లో స్టేషన్‌ మేనేజర్‌, ఆఫీసర్‌ సర్వీసెస్‌, అసిస్టెంట్‌, బేస్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీకామ్‌, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్‌,ఓబీసీ,ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.885, ఎస్సీ,ఎస్టీ,ఈడబ్ల్యూఎస్‌,పీహెచ్‌ అభ్యర్ధులు రూ.531లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి.

రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,446ల నుంచి రూ.24,440ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.becil.com/ పరిశీలించగలరు.