డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంకు ఉద్యోగాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 74 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీలు:
ఎకనమిస్ట్ – 1, CDO/చీఫ్ డేటా సైంటిస్ట్ – 1 డేటా అనలిస్ట్ – 3, సీనియర్ మేనేజర్ – 2, డేటా ఇంజనీర్ – 2, డేటా ఆర్కిటెక్ట్ – 2, సీఏ/ క్రెడిట్ ఆఫీసర్ – 5, సెక్యూరిటీ ఆఫీసర్ – 10, రిస్క్ మేనేజర్ – 12, క్రెడిట్ ఆఫీసర్ – 10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 26
దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC అభ్యర్ధులకు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులు మాత్రం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇందుకు డిగ్రీ, B.E, B.Tech, MCA, MBA, CA అర్హులై ఉండాలి.
వయసు:
అభ్యర్ధులు 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ముఖ్యమైన తేదిలు:
> దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 30, 2019.
> దరఖాస్తు చివరితేది: నవంబర్ 21, 2019.
> కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: డిసెంబర్ 11, 2019.
> ఆన్ లైన్ పరీక్ష: డిసెంబర్ 21, 2019.