Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటిస్‌ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ యాక్ట్‌ 1961 ప్రకారం 4500 అప్రెంటిస్ పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటిస్‌ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల

Central Bak of india jobs

Updated On : June 7, 2025 / 4:29 PM IST

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ యాక్ట్‌ 1961 ప్రకారం 4500 అప్రెంటిస్ పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే డిగ్రీ పట్టాదారులకు ఇది ఒక అద్భుత అవకాశంగా చెప్పొచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 7 నుంచి 23వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 01.01.2021 తర్వాత డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 31.05.1997 – 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి. తేదీ 31.05.2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాలుగా ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు సడలింపు ఉంటుంది.

నెలసరి ఆదాయం: నెలకు రూ.15,000

దరఖాస్తు విధానం: NATS పోర్టల్ https://nats.education.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత Central Bank of India Apprentice లింక్ ద్వారా అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫిల్ చేయాలి. తరువాత సబ్మిట్ చేయాలి

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.600. పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష. ప్రాంతీయ భాష నైపుణ్య పరీక్ష. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.