రాష్ట్రంలో కొత్తగా 15 సాంఘీక గురుకుల పాఠశాలలు : సీఎం చంద్రబాబు

గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 12:50 PM IST
రాష్ట్రంలో కొత్తగా 15 సాంఘీక గురుకుల పాఠశాలలు : సీఎం చంద్రబాబు

గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

 అమరావతి : రాష్ట్రంలో కొత్తగా మరో 15 గురుకుల పాఠశాలను ఎపీ ప్రభుత్వం మంజూరు చేసింది. 15 గురుకుల పాఠశాలల్లో 14,200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 15 సాంఘిక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.33.5 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.502 కోట్లతో నూతన విద్యాలయాల నిర్మాణం జరిగిందన్నారు. 

ఏటా 1,12,000 మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన విద్యార్థులను తయారు చేసే బాధ్యత గురుకుల విద్యా సంస్థలు తీసుకుంటాయన్నారు. ప్రతీ విద్యాలయంలో పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియం డిజిటల్, వర్చువల్ తరగతులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.