Coal India Recruitment : కోల్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణ‌త‌ కలగి ఉండటంతోపాటుగా క‌నీసం 3 నుంచి 7 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

Coal India Recruitment : కోల్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

CIL Recruitment

Updated On : August 13, 2023 / 3:10 PM IST

Coal India Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1764 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ అండ్‌ సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ కేడర్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

READ ALSO : Headache : తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని నివారణకు చిట్కాలు

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణ‌త‌ కలగి ఉండటంతోపాటుగా క‌నీసం 3 నుంచి 7 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో ఉంటుంది.

READ ALSO : Chandrababu : ప్రభుత్వ ప్రోత్సాహంతోనే నాపై దాడులు.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

అభ్యర్ధులు దరఖాస్తులను సెప్టెంబర్ 9, 2023లోపు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://coalindia.in/ పరిశీలించగలరు.