గేట్-2019 అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండిలా

గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష-2019 కు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 4న విడుదల కానున్నాయి.

  • Published By: sreehari ,Published On : December 31, 2018 / 12:40 PM IST
గేట్-2019 అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండిలా

గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష-2019 కు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 4న విడుదల కానున్నాయి.

ఢిల్లీ: గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష-2019 కు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 4న విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 10 వరకు నాలుగు రోజుల పాటు గేట్ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రెండు షిఫ్ట్‌లు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక షిఫ్ట్.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో షిఫ్ట్ చొప్పున గేట్ పరీక్ష జరుగనుంది. ఐఐటీ మద్రాసు నిర్వహించనున్న గేట్-2109 పరీక్ష‌ అడ్మిట్ కార్డు ల వివరాలను అధికారిక వెబ్ సైట్ gate.iitm.ac.in లో పొందుపరిచారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే అభ్యర్థులంతా గేట్ ఆన్‌లైన్ ఆప్లికేషన్ లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలను ఎంటర్ చేసి గేట్ పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డుపై పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలతో పాటు షిఫ్ట్ సమయం కూడా ఉంటుంది. పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంట తీసుకెళ్లాలి. లేదంటే పరీక్ష నిర్వాహకులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. మొబైల్స్, క్యాలికేటర్లు, రిస్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోని వెళ్లేముందు అడ్మిట్ కార్డు, ఐడీ ఫ్రూప్, పెన్ వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుపై సంతకాన్ని పోలి ఉండేలా పరీక్షా కేంద్రంలో సదరు అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే గేట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.