CUET UG 2024 Exams _ Last Date For Submitting Application Forms End Today
CUET UG 2024 Exams : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అండర్ గ్రాడ్యుయేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 26తో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌లను సమర్పించడానికి అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయొచ్చు. మే 15 నుంచి 31 వరకు హైబ్రిడ్ విధానంలో రోజుకు రెండు లేదా మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించి జూన్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు.
Read Also : UPSC Prelims Reschedule : ఎన్నికల వేళ.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. జూన్ 16న పరీక్ష!
2022లో ప్రారంభమైన కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) లేదా CUET (UG) దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్శిటీలు లేదా ఇతర రాష్ట్ర యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలను కలిగిన ఏదైనా సెంట్రల్ యూనివర్శిటీలు (CU) లేదా ఇతర భాగస్వామ్య సంస్థల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులకు అవకాశాన్ని అందిస్తుంది.
మొత్తం 13 భాషల్లో పరీక్ష :
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో రిజిస్ట్రేషన్ కోసం ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భాషలలో పరీక్ష జరుగనుంది. అంతేకాదు.. విదేశాలలో 26 నగరాలతో సహా 380 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. మునుపటి ఎడిషన్‌ల మాదిరిగా కాకుండా అభ్యర్థులు గరిష్టంగా 10 సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఇప్పుడు విద్యార్థులు గరిష్టంగా 6 సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతిస్తారు.
దరఖాస్తు విధానం ఇలా :