Hyderabad DRDO Recruitment 2023 : హైదరాబాద్‌ డీఆర్‌డీవో సెప్టమ్‌ లో ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ

ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలకు 70 శాతంగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 60 శాతంగా నిర్ణయించారు.

Hyderabad DRDO Recruitment 2023

Hyderabad DRDO Recruitment 2023 : హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్-సెప్టమ్ (DRDO-CEPTEM)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన (Contract Jobs) ప్రాజెక్ట్‌ స్టోర్‌ ఆఫీసర్‌ (Project Store Officer), ప్రాజెక్ట్‌ సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌ (Project Senior Admin Assistant), ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌ (Project Admin Assistant) పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : vellampalli Srinivasa Rao: చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి ఛాలెంజ్

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత, తగిన అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. డిసెంబరు 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు చివరి గడువుగా నిర్ణయించారు.

మొత్తం ఖాళీలు: 11 , కాగా వీటిలో యూఆర్-08, ఓబీసీ-02, ఎస్సీ-01. కేటాయించారు.

1) ప్రాజెక్ట్‌ స్టోర్‌ ఆఫీసర్‌: 01 ఖాళీ

అర్హత, వయసు, వేతనం :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/బీకామ్/బీఎస్సీ/బీసీఏ) కలిగి ఉండాలి. మాస్టర్ డిగ్రీతోపాటు జీఈఎం (గవర్నమెంట్ ఈ మార్కెట్‌ప్లేస్)పోర్టల్‌కు సంబంధించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో తగిన అనుభవం కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ , ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 50 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎంపికైన వారికి వేతనంగా నెలకు రూ.59,276. చెల్లిస్తారు.

READ ALSO : Ayodhya : అయోధ్య.. ఇక ఏఐ నగరం

2) ప్రాజెక్ట్‌ సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 05 పోస్టులు

అర్హత, వయసు, వేతనం :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/బీకామ్/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణులవ్వాలి. మాస్టర్ డిగ్రీతోపాటు జీఈఎం (గవర్నమెంట్ ఈ మార్కెట్‌ప్లేస్)పోర్టల్‌కు సంబంధించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో తగిన అనుభవం కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తోపాటు, ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 45 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. వేతనంగా నెలకు రూ.47,496. చెల్లిస్తారు.

READ ALSO : Water Fasting : వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది ?

3) ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 05 పోస్టులు

అర్హత,వయసు, వేతనం :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/బీకామ్/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మాస్టర్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌) అర్హత ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలియటంతోపాటు ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. వేతనంగా నెలకు రూ.35,220. చెల్లిస్తారు.

READ ALSO : Kakinada : కాకినాడలో డాక్టర్ ఆత్మహత్య.. వైసీపీ నేతల అనుచరుల వేధింపులే కారణమంటున్న ఫ్యామిలీ

దరఖాస్తు ఫీజు:

రూ100. దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Sri Sathya Sai : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య

ఎంపిక విధానం:

దరఖాస్తులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలకు 70 శాతంగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 60 శాతంగా నిర్ణయించారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 15.12.2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.drdo.gov.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు