Water Fasting : వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది ?

నీటి ఉపవాసం కణాలను రీసైకిల్ చేయడంలో,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Water Fasting : వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది ?

water fasting

Water Fasting : బరువు తగ్గడానికి ఇటీవలి కాలంలో అనేక రకాల విధానాలను చాలా మంది అవలంబిస్తున్నారు. అయితే వీటన్నింటిని ఎటువంటి వైద్యుల సలహా లేకుండా చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం కంటే హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో డైటింగ్‌తో పాటు, వివిధ రకాల ఉపవాసాలు ఎక్కు ప్రాచుర్యంలో ఉన్నాయి, ఇవి బరువు తగ్గడానికి, శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపేందుకు చేస్తారు. ఇలాంటి ఉపవాసాలలో ఒకటి నీటి ఉపవాసం. నీటి ఉపవాసం అంటే ఏమిటి దాని ప్రయోజనాలు , ఎదురయ్యే సమస్యల గురించి తెలుసకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Benefits of Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఎన్నో లాభాలు తెలుసా ?

నీటి ఉపవాసం అంటే ఏమిటి?

నీటి ఉపవాసంలో, ఒక వ్యక్తి నీరు తప్ప మరేదైనా పదార్ధాలను తీసుకోరు. ఈ ఉపవాసంలో నీరు మాత్రమే తాగుతారు. దీనిని 24 నుండి 72 గంటల పాటు కొనసాగిస్తారు. బరువు తగ్గడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గంగా చెబుతున్నారు. అందుకే చాలా మంది ఈ ఉపవాసాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కొవ్వు తగ్గడం వల్ల బరువు కూడా తగ్గేలా చేస్తుంది.

నీటి ఉపవాసం వల్ల ప్రయోజనాలు ;

నీటి ఉపవాసం కణాలను రీసైకిల్ చేయడంలో,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నీటి ఉపవాసం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు , అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేయకూడదు.

READ ALSO : Health Benefits of Fasting : ఉపవాసం అవసరమా? దీని వల్ల ఆరోగ్యానికి కలిగే మేలెంత..

నీటి ఉపవాసం వల్ల ఎదురయ్యే సమస్యలు ;

కేలరీల కొరత కారణంగా శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగిస్తుంది. దీని కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదేసమయంలో అకస్మాత్తుగా బరువు కోల్పోవటం అన్నది ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. ఈ ఉపవాస సమయంలో, కొవ్వులతో పాటు, కండరాలు తగ్గుతాయి, ఇది ఆరోగ్యానికి హానికరం. నీరు మాత్రమే తాగడం వల్ల శరీరంలో శక్తి లోపిస్తుంది. దాని వల్ల ఆయాసం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

READ ALSO : ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇవి తినండి

అలాగే శరీరం యొక్క ఎలెక్ట్రోలైట్స్లో మార్పు చోటు చేసుకుని రక్తపోటు గణనీయంగా పడిపోతుంది. ఇది గుండె అరిథ్మియా ప్రమాదం పెరుగటానికి కారణమౌతుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. వాటర్ ఫాస్టింగ్ వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. నీరు తాగిన తర్వాత డీహైడ్రేషన్‌కు గురవుతారనేది కాస్త వింతగా అనిపించవచ్చు. అయితే ఇది నిజం. నీరు మాత్రమే తాగడం, ఏమీ తినకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.