Benefits of Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఎన్నో లాభాలు తెలుసా ?

ఆవనూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు అనేక వ్యాధుల నుండి రక్షణనిస్తాయి. చలికాలంలో మస్టర్డ్ ఆయిల్ మనకు ఔషధంలా పనిచేస్తుంది.

Benefits of Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఎన్నో లాభాలు తెలుసా ?

mustard oil

Benefits of Mustard Oil : చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్, స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే ఆవాల నూనె చాలా బాగా ఉపకరిస్తుంది. సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, కొన్ని తీవ్రమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగించటంలో ఆవనూనె బాగా ఉపకరిస్తుంది. చలికాలంలో గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చలికాలంలో ఆవనూనెను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Heart Health : ఆఫీస్ విధులలో ఎక్కువ గంటలు గడిపితే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ?

ఆవనూనెతో ప్రయోజనాలు ;

ఆవనూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు అనేక వ్యాధుల నుండి రక్షణనిస్తాయి. చలికాలంలో మస్టర్డ్ ఆయిల్ మనకు ఔషధంలా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి చలికాలంలో ఆవనూనె వల్ల వివిధ రూపాల్లో ఉపయోగించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జలుబు, దగ్గు, ఫ్లూలో మేలు చేస్తుంది:

చలికాలంలో జలుబు సమస్య సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం నుండి ఉపశమనం లభిస్తుంది. శ్లేష్మం బయటకు వస్తుంది.

READ ALSO : Heart Health in Winter : చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడు కోవాలంటే ?

ముక్కు మూసుకుపోయినట్లయితే వేడి నీటిలో ఆవాల నూనె వేసి ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఆవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి, కాసేపు ఉడికించి, ఒక పాత్రలో ఉంచి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కలను ముక్కులో వేసుకోవాలి. ఇలా చేస్తే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

గుండెను ఆరోగ్యానికి ఆవనూనె :

ఆవనూనెలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్కీమిక్ గుండె ఇబ్బందులను యాభై శాతం తగ్గిస్తాయి. అందువల్ల ఆహారపదార్ధాల తయారీలో ఆవనూనెను ఉపయోగించి తయారు చేసుకోవటం మంచిది. దీనితో పాటు సలాడ్‌లో కొంచెం కలుపుకుని తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.

READ ALSO : Winter Tips : చలికాలంలో ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !

ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగించటంలో ;

గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆర్థరైటిస్ నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చేతులు, కాళ్ల వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్ నుండి ఉపశమనం పొందటంలో :

ఆవ నూనె క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో కనుగొన్నారు. కాబట్టి ఆహారంలో ఆవ నూనెను మాత్రమే ఉపయోగించటం వల్ల క్యాన్సర్ దరిచేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా, ఈ నూనెను ఉపయోగించడం వల్ల ఆస్తమా, దగ్గు మరియు పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.