Winter Tips : చలికాలంలో ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !

గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Winter Tips : చలికాలంలో ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !

winter to stay healthy

Winter Tips : వాతావరణం చల్లబడుతుంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. వైరస్ లు విజృంభించటానికి ఇదే సరైన సమయం. తక్కువ ఉష్ణోగ్రతలు మన శరీర రోగనిరోధక వ్యవస్ధ ప్రతిస్పందనను తగ్గిస్తాయి. దీనర్థం మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే అనారోగ్యాన్ని తీవ్రం చేసే ఆహారాలను నివారించటంపై వివరించరు. ఈ కధనం ద్వారా శీతాకాలంలో తప్పనిసరిగా నివారించాల్సిన ఆహారాల గురించి తెలుసకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?

కేక్ లు, తియ్యటి పదార్ధాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు వంటి పానీయాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. తినేటప్పుడు బాగానే ఉన్నా శరీరానికి అత్యంత ఘోరమైన శత్రువులుగా చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఫ్రిజ్ నుండి బయటకు తీసిన ఆహారాన్ని నేరుగా తీసుకోవద్దు. పావుగంట పాటు బయట ఉంచిన తరువాత చల్లదనం తగ్గితేనే తినాలి. చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

వేయించిన ఆహారం అనగా వేపుడులు, అయిల్స్ ఫుడ్స్ వంటి ఆహారాల్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఈ తరహా ఆహారాలు హానికరం. అధిక కొవ్వు పదార్ధం బరువు పెరగటంతోపాటు , శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. వీటి వల్ల ఆస్తమా ,ఇతర ఇన్ఫెక్షన్‌లకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి, చలికాలంలో పాలు, షేక్స్, స్మూతీస్ వంటి చల్లని పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉండటమే మంచిది.

READ ALSO : Seasonal Depression : చలికాలంలో ఎదురయ్యే మానసిక సమస్యలు !

గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శారీరక శ్రమ చేయని వారు వాటిని తినకుండా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ తింటే జీర్ణ సమస్యలు ,బరువు పెరగటం జరుగుతుంది. చల్లటి వాతావరణంలో ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం చాలా మంచిది. వాటి వల్ల అలర్జీ కలిగే ప్రమాదం ఉంటుంది. సలాడ్ ,పచ్చి కూరగాయల ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఈ ఆహారాలు ఎసిడిటీని ,ఉబ్బరాన్ని పెంచుతాయి.

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. వారు సూచించిన విధాంగా ఆహారాలు తీసుకోవటం మంచిది.

READ ALSO : Cracked Feet : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి!

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.