Health Benefits of Fasting : ఉపవాసం అవసరమా? దీని వల్ల ఆరోగ్యానికి కలిగే మేలెంత..

కడుపు మాడ్చుకోవడమే ఉపవాసం కాదు. దీన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. పరిమితికి మించని మేలు చేసే ఆహారం తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం. పంచేంద్రియాలు తృప్తిపడేలా మనం తీసుకునే ఆహారం ఉండాలి.

Health Benefits of Fasting : ఉపవాసం అవసరమా? దీని వల్ల ఆరోగ్యానికి కలిగే మేలెంత..

Benefits of Fasting

Health Benefits of Fasting : ఇంతకీ మీరు ఇవాళ భోజనం చేశారా? నేనైతే ఇవాళ ఉపవాసమండీ. ఇవాళేమైనా పండగ ఉందా.. ఉపవాసం దేనికి అనుకుంటున్నారా..? ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థకు అప్పుడప్పుడు రెస్టివ్వాలి కదా. నిజానికి ఉపవాసం చేయాలంటే పండగలూ, స్పెషల్ డేస్ అక్కర లేదండీ. అవునూ ఇంతకీ ఇలా ఉపవాసం చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో తెలీదు గానీ, మన ఆరోగ్యానికి మాత్రం తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు.

READ ALSO : Sitara Ghattamaneni : సితార పాప వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..

సోమవారం శివుడికి.., మంగళవారం ఆంజనేయుడికి.., అంటూ ఉపవాసాలు చేస్తుంటాం. ఇలా ఆధ్యాత్మికతను పెంచే ఉపవాసం ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి జబ్బులు పెరుగుతున్న ఈ కాలంలో ఉపవాసం అనేది బెస్ట్ మెడిసిన్.

కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో సరిగా జీర్ణం కాకుండా హానికరమైన పదార్థాలు తయారవుతాయి. వీటివల్ల ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చేయడం వల్ల ఇలాంటి మలిన పదార్థాలు తొలగిపోయి, ఫ్రీరాడికల్స్ తగ్గిపోతాయి.

READ ALSO : Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు

ఉపవాసం చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. అది మరింత చురుకుగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. మనం తీసుకునే ఆహారం లోని ధాతువులు సక్రమంగా జీర్ణం కావడానికి బలం చేకూరుతుంది. సరిగా జీర్ణం కాలేనివి కూడా బాగా జీర్ణం అయ్యేట్టుగా, మలినాలు తొలగిపోయేలా చేస్తుంది.

చాలా సందర్భాల్లో మన ఆయుర్వేదంలో చెప్పిన విషయాలనే అల్లోపతి సైంటిస్టులు పరిశోధన చేసి చెప్తే గానీ మనం నమ్మం. ఉపవాసం విషయంలో కూడా అలాగే జరిగింది. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో కూడా తేలింది. హానికరమైన టాక్సిక్ పదార్థాలను కూడా డైజెస్ట్ చేసి రీసైక్లింగ్చేయొచ్చని కనుక్కున్నారు. ఉపవాసం చేయడం వల్ల ఆటోఫేజి ప్రక్రియ ద్వారా హానికర పదార్థాలను శరీరం చంపేస్తుందని ఈ పరిశోధనలో తేలింది.

READ ALSO : Women’s Reservation Bill : కేంద్రం సంచలన నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

ఉపవాసం ఏ విధంగా చేయాలి?

ఉపవాసం ఉండాలి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తిండి మానేయడం కాదు. దీనికీ ఓ పద్ధతి ఉంది. శరీర స్థితిగతులను బట్టి ఉపవాసం ఎలా చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే తిండి మానేయడం కరెక్ట్ కాదు. మరి ఉపవాసం ఎలా చేయాలి? ఎవరు చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపు మాడ్చుకోవడమే ఉపవాసం కాదు. దీన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. పరిమితికి మించని మేలు చేసే ఆహారం తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం. పంచేంద్రియాలు తృప్తిపడేలా మనం తీసుకునే ఆహారం ఉండాలి. రుచిగా ఉందని ఎక్కువగా తినొద్దు. అలాగని కడుపు మాడ్చుకోనూ వద్దు. ఫుడ్ తీసుకునే విషయంలో సమయపాలన పాటించాలి. శరీర ఆరోగ్యం, పరిస్థితులను బట్టి ఉపవాసం చేయాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్య ప్రయాజనాలు ఉంటాయి.

READ ALSO : PM Modi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు

దేవుడు సంతోషిస్తాడని ఆరోగ్యం సహకరించకపోయినా ఉపవాసం చేయొద్దు. శారీరక, మానసిక పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండాలి. ఒక పూట ఆహారం తీసుకుని, రెండో పూట అల్పాహారం అంటే పాలు, పండ్లు లాంటివి తీసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పటికీ 600 కేలరీల కన్నా తక్కువ తీసుకోకూడదు.జీర్ణాశయంలో సగభాగం ఘన పదార్థాలు, మిగిలిన సగంలో పావు భాగం ద్రవపదార్థాలు ఉండేలా తీసుకోవాలి. మిగిలిన పావు భాగం గాలికి వదిలేయాలి.

పండగ పూట ఉపవాసం చేయకపోతే ఎలా అని ప్రతి ఒక్కరూ ఉపవాసం చేసేస్తేచిక్కుల్లో పడాల్సి వస్తుంది. శరీర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉపవాసం చేయాలి. జబ్బుతో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తే నిరోధక శక్తి తగ్గిపోయి, మరింత నీరసించిపోతారు. డయాబెటిస్, గుండెజబ్బుల్లాంటిజబ్బులున్నవాళ్లు ఉపవాసం జోలికి వెళ్ల కూడదు.