PM Modi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ...

PM MOdi
PM Modi speaks in Loksabha: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పార్లమెంట్ భవనంలో ఈరోజు చివరి సమావేశాలు జరుగుతున్నాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పాత భవనంలో పలు జ్ఞాపకాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి మోదీ ప్రస్తావించారు. ఆ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మోదీ అన్నారు.
ఈ పార్లమెంట్ భవనంలోనే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల విభజన జరిగింది. వాజ్‌పేయీ హయాంలో ఈ మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఈ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, తెలంగాణ, ఏపీ విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రజలు సంతృప్తిపర్చలేకపోయిందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని అన్నారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేపోయిందని, మరోవైపు ఏపీ ప్రజలుసైతం తీవ్ర ఇబ్బంది పడ్డారని మోదీ అన్నారు.
Modi Praises Nehru and Indira: నెహ్రూ, ఇందిరా గాంధీలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సరియైన పద్దతిలో జరగలేదని, యూపీఏ తీరువల్లనే ఇరు రాష్ట్రాల ప్రజలు విభజన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.