vellampalli Srinivasa Rao: చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి ఛాలెంజ్

చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులంటూ వెల్లంపల్లి విమర్శించారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు..

vellampalli Srinivasa Rao: చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి ఛాలెంజ్

Velampally Srinivasa Rao

Updated On : November 26, 2023 / 11:33 AM IST

YCP MLA vellampalli Srinivasa Rao: మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లకు ఛాలెంజ్ చేశారు. ఆర్యవైశ్యులకు నేనేమి చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. టీడీపీ ఆపీస్ కు రమ్మన్నా కూడా నేను సిద్ధమే అంటూ సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని వెలంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులు ఇచ్చారని వెల్లంపల్లి అన్నారు.

Also Read : Revanth Reddy : పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కార్తీక పౌర్ణమి స్నానాలకోసం వేలాది మంది భక్తులు వచ్చేచోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులంటూ వెల్లంపల్లి విమర్శించారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదని అన్నారు. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుంది సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

Also Read : Uttarakhand Uttarkashi : సొరంగంలోనే కార్మికులు.. వాళ్లు బయటకు రావాలంటే డిసెంబర్ చివరి వారం వరకు సమయం పడుతుందా?

చింతామని నాటకం జీవో రద్దు, వాసవి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది సీఎం జగన్. మీరా నన్ను విమర్శించేది. చందాలకోసం ఆర్యవైశ్యుల ముసుగులో రాజకీయ డ్రామాలాడతారా? ఎంతమంది కలిసొచ్చినా నా చిటికిన వేలు వెంట్రుక కూడా పీలేకరు అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ టికెట్ వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేశ్ కు ఉందా అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.