DRDO Recruitment: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. రూ.56 వేల జీతం.. ఇవాళే చివరి తేదీ.. ఇలా అప్లై చేసుకోండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓ, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

drdo recruitment
మీరు బీటెక్ కంప్లీట్ చేశారా. అయితే ఈ అవకాశం మీకోసమే. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓ, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తలు 148 పోస్టులు కాగా.. అందులో డీఆర్‌డీఓలో సైంటిస్ట్- బి పోస్టులు 127, ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి పోస్టులు 9, ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి పోస్టులు 12. బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. అధికారిక వెబ్ సైట్ https://rac.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత: అభ్యర్థులు సబ్జెక్టులో వ్యాలిడ్ గేట్ స్కోర్‌తో పాటు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ/ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లాస్ట్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: వయస్సు: అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించరాదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.100.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరును ఆధారంగా తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వేతన వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 జీతం అందజేస్తారు.