Jobs In ECIL: ECIL హైదరాబాద్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు ₹55,000 వరకు జీతం! బీటెక్ అర్హత.. వెంటనే అప్లై చేయండి!
Jobs In ECIL: హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగ ఇంజినీర్లకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది.

Jobs in ECIL Hyderabad
హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగ ఇంజినీర్లకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన అంశాలు:
సంస్థ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్.
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు: 02
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: జూలై 6, 2025
ప్రాజెక్ట్ ఇంజినీర్:
వయోపరిమితి: ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 33 సంవత్సరాలు దాటకూడదు.
వేతనం వివరాలు: ఈ జాబ్స్ కోసం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు అందుతుంది.
టెక్నికల్ ఆఫీసర్:
వయోపరిమితి: ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలు దాటకూడదు.
వేతనం వివరాలు: ఈ జాబ్స్ కోసం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 వరకు అందుతుంది.
అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ECE, EEE, E&I, ETC, ఎలక్ట్రానిక్స్, లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు తమ బీటెక్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా 1:4 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు వర్చువల్ (ఆన్‌లైన్) ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 25 జూన్ 2025 (మధ్యాహ్నం 2:00 గంటల నుండి)
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06 జూలై 2025 (మధ్యాహ్నం 2:00 గంటల వరకు)
దరఖాస్తు చేయడం ఎలా?
- అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ECIL అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో ‘Careers’ విభాగంలోకి వెళ్లి, ‘Current Job Openings’ పై క్లిక్ చేయాలి.
- సంబంధిత నోటిఫికేషన్‌ను ఎంచుకుని, సూచనల ప్రకారం దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాలి.