Cdac Jobs : హైదరాబాద్ సీ డ్యాక్ లో ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

Cdac Hyderabad
Cdac Jobs : హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీ డ్యాక్) లో ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
సాఫ్ట్ వేర్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంబడెడ్ సిస్టమ్, మెషిన్ లెర్నింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్లు 2, సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్లు 8, ప్రాజెక్ట్ ఇంజనీర్లు 41, ప్రాజెక్ట్ అసోసియేట్లు 3 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 30, 2022ను ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.cdac.in/ సంప్రదించగలరు.