Jobs : ఎస్ఐడిబిఐలో ఖాళీల భర్తీ
ఇప్పటికే పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 24 తుదిగడువుగా నిర్ణయించారు. అభ్యర్ధులను ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

Sidbi Jobs
Jobs : స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి జనరల్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ చేస్తారు.ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ , లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ, సీఎఫ్ ఏ లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు మార్చి 4, 2022 నాటికి 21 ఏళ్ల నుండి 28ఏళ్ల మధ్య ఉండాాలి. ఎస్.సీ, ఎస్టీ, అభ్యర్ధులకు 5ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3ఏళ్లు వయస్సులో సడలింపు ఇస్తారు.
ఇప్పటికే పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 24 తుదిగడువుగా నిర్ణయించారు. అభ్యర్ధులను ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి వేతనంగా 28,150రూ బేసిక్ వేతనంతో మొత్తం 70,000రూ వేతనంగా లభిస్తుంది. దరఖాస్తు ఫీజును 1100రూ. ఎస్,సీ, ఎస్.టీ , దివ్యాంగులకు 175 రూ. గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.sidbi.in/en/careers సంప్రదించగలరు.