Vacancies in NIELIT : ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి.

Vacancies in NIELIT
Vacancies in NIELIT : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డ్రాఫ్ట్స్‌మన్ సి, హెల్పర్ బి, ల్యాబ్ అసిస్టెంట్ ఎ, ల్యాబ్ అసిస్టెంట్ బి & ట్రేడ్స్‌మెన్ బి తదిర పోస్టులు ఉన్నాయి.
పోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి. భర్తీ చేయనున్న పోస్టుల్లో డ్రాఫ్ట్స్‌మన్-సి: 05, ల్యాబ్ అసిస్టెంట్-ఎ: 05, ల్యాబ్ అసిస్టెంట్-బి: 20, హెల్పర్-బి: 26, ట్రేడ్స్‌మ్యాన్-బి: 24 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ అక్టోబరు 2 నుంచే అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీగా 31.10.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nielit.gov.in/ పరిశీలించగలరు.