Ncdc Recruitment : న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఒప్పంద ఖాళీల భర్తీ
ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు కింది ఈ మెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.

Filling up of contract vacancies in National Cooperative Development Corporation, New Delhi
Ncdc Recruitment : భారత ప్రభుత్వ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు 1, సీనియర్ కన్సల్టెంట్(ఫైనాన్స్) పోస్టు 1, కన్సల్టెంట్(రిస్క్ మేనేజ్‌మెంట్) పోస్టు 1, కన్సల్టెంట్ (ట్యాక్సేషన్) పోస్టు 1, కన్సల్టెంట్ (మార్కెట్ బారోయింగ్) పోస్టు 1, కన్సల్టెంట్ (బ్యాంకింగ్ రెగ్యులేషన్స్) పోస్టు 1, కన్సల్టెంట్ (అగ్రి ఫైనాన్స్) పోస్టు 1, కన్సల్టెంట్ (కోఆపరేటివ్ ట్యాక్సేషన్) పోస్టు 1, కన్సల్టెంట్ (మార్కెటింగ్) పోస్టు 1, యంగ్ ప్రొఫెషనల్-2(ఫైనాన్స్) పోస్టులు 4, యంగ్ ప్రొఫెషనల్-1(మీడియా కమ్యూనికేషన్) పోస్టులు 2, యంగ్ ప్రొఫెషనల్-1(మార్కెటింగ్) పోస్టులు 31, యంగ్ ప్రొఫెషనల్-2(ఫైనాన్స్) పోస్టులు 6 ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 32 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు కింది ఈ మెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్ ఐడీ: careers@ncdc.in పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ncdc.in/ పరిశీలించగలరు.