DMHO Chittoor Recruitment : చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే క్వాలిఫైయింగ్ పరీక్ష, పని అనుభవం అధారంగా తుది ఎంపి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 12,000 నుండి 1, 10000 వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

DMHO Chittoor Recruitment : చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టుల భర్తీ

Chittoor Staff Nurse, Pharmacist & Lab Technician and other ...

Updated On : December 28, 2022 / 12:55 PM IST

DMHO Chittoor Recruitment : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పెడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్ తదితర ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి 5, 10 తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ, ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండిలి. అభ్యర్ధుల వయస్సు 42 సంవత్సరాలకు మించరాదు.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే క్వాలిఫైయింగ్ పరీక్ష, పని అనుభవం అధారంగా తుది ఎంపి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 12,000 నుండి 1, 10000 వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, చిత్తూరు పేరుతో పంపాలి. దరఖాస్తులకు చివరి తేదిగా డిసెంబర్ 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; chittoor.ap.gov.in పరిశీలించగలరు.