GATE 2025 : గేట్ 2025 అభ్యర్థులకు అలర్ట్.. లేట్ ఫీజు లేకుండా అప్లయ్ చేసుకోండిలా..!

GATE 2025 : అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో చివరి తేదీ అక్టోబర్ 7, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

GATE 2025 : గేట్ 2025 అభ్యర్థులకు అలర్ట్.. లేట్ ఫీజు లేకుండా అప్లయ్ చేసుకోండిలా..!

GATE 2025 _ Registration Window Without Late Fee Closes Tomorrow

Updated On : October 2, 2024 / 9:25 PM IST

GATE 2025 : గేట్ పరీక్ష అప్లయ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఎలాంటి రుసుము లేకుండా అక్టోబర్ 3 వరకు గేట్ పరీక్ష అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 పరీక్ష ఆన్‌లైన్ అప్లికేషన్ విండో ముగియనుంది.

Read Also : Upcoming Phones 2024 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రాబోయే 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వారికి చివరి సమర్పణ తేదీ అక్టోబర్ 7, 2024గా నిర్ణయించారు. గేట్ పరీక్ష ఫిబ్రవరి 1, 2, 15, ఫిబ్రవరి 16, 2025న షెడ్యూల్ అయింది. గేట్ పరీక్ష ఫలితాలు మార్చి 19న విడుదల కానున్నాయి. అడ్మిట్ కార్డ్‌లు జనవరి 2వ తేదీన జారీ చేయనున్నారు.

గేట్ 2025 దరఖాస్తు విధానం :

  • ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ (gate2024.iisc.ac.in) సందర్శించండి.
  • “Apple Online” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్టర్ ప్రాసెస్ పూర్తి చేయండి
  • అవసరమైన వివరాలను నింపండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక కాపీని దగ్గర ఉంచుకోండి.

అర్హత ప్రమాణాలు :
అర్హతలో ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో మూడో సంవత్సరం లేదా ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు అర్హులు. అలాగే ఇప్పటికే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీని పూర్తి చేసిన విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము :
స్త్రీ/ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యూడీ (పేపర్‌కు): రూ 900 ఇతర అభ్యర్థులు, విదేశీ పౌరులతో సహా (పేపర్‌కు) : రూ 1800

పరీక్ష వ్యవధి :
గేట్ 2025 పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది (అదనపు సమయం అవసరమయ్యే అభ్యర్థులకు 4 గంటలు) మొత్తం 100 మార్కులతో 65 ప్రశ్నలు ఉంటాయి. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత పరీక్ష ముగుస్తుంది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అనేది ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్‌లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని అంచనా వేసే నేషనల్ లెవల్ టెస్టు. మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌ల (PSU) రిక్రూట్‌మెంట్ ఉపయోగించుకుంటారు.

Read Also : iPhone 16 vs iPhone 17 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 కొంటే బెటరా? ఐఫోన్ 17 కోసం వేచి ఉండాలా?