GATE 2026: గేట్ 2026 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కీలక అప్డేట్.. డైరెక్ట్ లింక్ తో ఇలా అప్లై చేసుకోండి
GATE 2026: గేట్ 2026 అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ప్రారంభించింది.

GATE 2026 registration process to begin from August 25
గేట్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ప్రారంభించింది. ఆగస్టు 25, 2025 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది. ఆలాగే ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6 వరకు గడువు ఉంటుంది.
గేట్ 2026 పరీక్షల తేదీలు, వివరాలు:
- 2026 ఫిబ్రవరి 7, 8 (శనివారం, ఆదివారం)
- 2026 ఫిబ్రవరి 14, 15, (శనివారం, ఆదివారం)
- పరీక్ష ఫలితాలను మార్చి 19, 2026న విడుదల చేస్తారు.
ఎవరు అర్హులు:
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో మూడొవ సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్‌లో ప్రభుత్వ ఆమోదం పొందిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ఐఈ, ఐసీఈ, ఐఈటీఈ, ఏఈఎస్ఐ, ఐఐసీహెచ్ఈ, ఐఐఎం, ఐఐఐఈ వంటి ప్రొఫెషనల్ సొసైటీల నుంచి అర్హత పొందిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షలు రాయొచ్చు. కానీ, వారి సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఎంఓఈ/ఏఐసీటీఈ/యూజీసీ/యూపీఎస్సీ ద్వారా బీఈ/బీటెక్/బీఆర్చ్/బీప్లానింగ్ డిగ్రీకి సమానంగా ఆమోదించబడాలి. విదేశీ డిగ్రీ హోల్డర్లు/ అందుకు సమానమైన ప్రోగ్రాముల్లో మూడొవ సంవత్సరం/ అంతకంటే ఎక్కువ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.