DSC 2025: డీఎస్సీ.. వివాహిత మహిళా అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారు
ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని తేల్చి చెప్పారు.

AP DSC
DSC 2025: డీఎస్సీ 2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వివాహిత మహిళా అభ్యర్థులకు అలర్ట్. వారు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లయ్ చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని తేల్చి చెప్పారు.
Also Read: మెగా డీఎస్సీ-2025కి అప్లై చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
అటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారయ్యాయి. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయి. నాలుగు జిల్లా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందొచ్చు. వివిధ శాఖల్లో 81 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.