షెడ్యూల్ ప్రకారమే Group Exams : అభ్యర్థుల్లో ఆందోళన

  • Published By: madhu ,Published On : April 18, 2019 / 10:19 AM IST
షెడ్యూల్ ప్రకారమే Group Exams : అభ్యర్థుల్లో ఆందోళన

Updated On : April 18, 2019 / 10:19 AM IST

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనుంది APPSC. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇప్పటికే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నష్టపోతామంటూ ఆందోళనచేస్తున్నారు. గ్రూప్2 పోస్టులకు, 1053 పంచాయితీ కార్యదర్శి పోస్టులతో పాటు ఇతర పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 21 తేదీన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌలోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
Also Read : వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్

మే 5వ తేదీన గ్రూప్2 పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు AEE పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఏపీపీఎస్సీ. ఈ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఓఎమ్మార్ షీట్ల ద్వారా నిర్వహించనున్నట్లు .. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయబాస్కర్ తెలిపారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మరో 9 నోటిఫికేషన్‌లకు సంబంధించిన 957 పోస్టుల భర్తీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో చేపట్టనుంది. వీటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

అయితే APPSC నిర్ణయాన్ని అభ్యర్ధులు తప్పు బడుతున్నారు. గ్రూప్‌ 2 ఎగ్జామ్‌ జరిగే రోజే తెలంగాణాలో SI పరీక్ష ఉంది. 10 వేల మంది AP నుంచి అటెండ్ అవుతున్నారు. మరో వైపు చాలా మంది ఈ పరీక్ష రాసే చిన్నస్థాయి ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తలమునకలై పరీక్షకు సిద్ధం కాలేదు. వీరంతా ఈ రెండు పరీక్షలను వాయిదా వేయమని కోరుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు వినతిపత్రం అందించామని అయినా.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోందని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అభ్యర్థుల డిమాండ్స్‌ని పరిగణలోకి తీసుకోలేమని చెప్తోంది ఏపీపీఎస్సీ. వాయిదాలు వేసుకుంటూపోతే ఇచ్చిన నోటిఫికేషన్ భర్తీ పూర్తి చేయడానికి .. చాలా సమయం పడుతుందని చెబుతోంది. కనుక యధావిధిగా పరీక్ష నిర్వహిస్తామని తేల్చేసింది. 
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం