HALలో 826 ఉద్యోగాలు..దరఖాస్తు ప్రారంభం

హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నాసిక్ డివిజన్ HALలో సంవత్సరం పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25న ప్రారంభమైంది. మే 15న ముగుస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు ITI పాసై ఉండాలి.
HALలో మొత్తం 826 ఖాళీలున్నాయి. అందులో 561 ITI ట్రేడ్ అప్రెంటీస్, 137 టెక్నీషియన్ అప్రెంటీస్, 103 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, 25 టెక్నీషియన్ – వొకేషనల్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.