Shool Education: ఏపీ పాఠశాల విద్యలో భారీ మార్పులు.. ఇక నుంచి 9 రకాల బడులు..!
ప్రస్తుత విధానంలో 6 రకాల బడులు ఉన్నాయి. వాటి స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి.

School Education: ఏపీలోని కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. పాఠశాల విద్యలో భారీగా మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు రాబోతున్నాయి. జీవో 117 రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా తెస్తున్న విధానంలో 9 రకాల పాఠశాలలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రాథమికంగా లిస్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత విధానంలో 6 రకాల బడులు ఉన్నాయి. వాటి స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి. ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు రానున్నాయని సమాచారం. ప్రాథమిక బడుల్లో 45 మంది లోపు విద్యార్థులు ఉంటే వాటిని బేసిక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 45 మంది కంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే తరగతికో టీచర్‌ను కేటాయిస్తారు. వీటిని ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు.
1వ తరగతి నుంచి 10వ తరగతులు ఉండే బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు రాష్ట్రంలో 900 వరకు ఏర్పడనున్నాయని సమాచారం. ఇంటర్ తో ఉన్నవి హైస్కూల్ ప్లస్‌లుగా కొనసాగుతాయి. కొన్ని ప్రాథమికోన్నత బడులు ఉంటాయి. మొదట్లో వీటిని ఉన్నతీకరించడం లేదంటే హోదా తగ్గించాలని భావించారు.
కానీ, క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా 240కి పైగా ప్రాథమికోన్నత బడులను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల 5 రకాల పాఠశాలలను తీసుకురావాలని విద్యాశాఖ భావించినా క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఇవి 9 రకాలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ బడులు అందుబాటులోకి రానున్నాయి.
Also Read: ఏపీలో డీఎస్సీకి అప్లయ్ చేస్తున్నారా.. అయితే, వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
* పూర్వ ప్రాథమిక విద్య- 1, 2 (ఎల్ కేజీ, యూకేజీ) ఉండే బడులను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు. అంగన్‌వాడీలనే ఇలా మార్పు చేస్తారు. ఇవి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి.
* పీపీ-1, 2తో పాటు ఒకటి, రెండు తరగతులు కలిపి ఫౌండేషనల్ స్కూల్స్ గా ఉంటాయి.
* పీపీ-1, 2తో పాటు 1-5 తరగతులు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు. 1-5 తరగతుల్లో 45 మంది లోపు పిల్లలు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు.
* పీపీ-1, 2, ఒకటి నుంచి 5 తరగతులు ఉండి, 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నవి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా ఉంటాయి.
* ప్రాథమికోన్నత బడులు కొనసాగుతాయి. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని ఉన్నత పాఠశాలలుగా.. మరికొన్నింటిని ప్రాథమిక బడులుగా మార్పు చేశారు. స్థానిక పరిస్థితుల కారణంగా కొన్నింటిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. 6-10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలు ఉంటాయి.
* 1-10 తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. జీఓ-117 రద్దుతో గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చి, ప్రాథమిక బడుల్లో విలీనం చేయడంలో ఇబ్బందులు ఏర్పడడంతో వాటిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. వీటికి 1, 2 తరగతులను చేర్చుతారు.
* 1-10 తరగతులు ఉంటే ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక బడుల్లో 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఇక్కడ తరగతికి ఒక్క టీచర్‌ను కేటాయిస్తారు.
* రాష్ట్రంలో 294 హైస్కూల్ ప్లస్‌లు కొనసాగనున్నాయి. వీటిల్లో 1-12 లేదా 6-12 తరగతులు ఉంటాయి. గత ప్రభుత్వంలో హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్ చేశారు. ఇక్కడ ఇంటర్మీడియట్ బోధనకు ఉపాధ్యాయులనే నియమించారు. దీంతో వీటిని పాఠశాల విద్యలోనే కొనసాగించాలని నిర్ణయించారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here