Job Mela: నిరుద్యోగ యువతుకు గుడ్ న్యూస్.. భారీ జాబ్ మేళా.. మరిన్ని వివరాలు మీకోసం

కాకినాడ జిల్లా కేంద్రంగా ఈ నెల 27వ తేదీన మెగా జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు కాకినాడ జిల్లా ఉపాధి అధికారి ఈ. వసంత లక్ష్మి అధికారిక ప్రకటన చేశారు.

Job Mela: నిరుద్యోగ యువతుకు గుడ్ న్యూస్.. భారీ జాబ్ మేళా.. మరిన్ని వివరాలు మీకోసం

Job mela in kakinada

Updated On : June 26, 2025 / 5:54 PM IST

నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త.. కాకినాడ జిల్లా కేంద్రంగా ఈ నెల 27వ తేదీన మెగా జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు కాకినాడ జిల్లా ఉపాధి అధికారి ఈ. వసంత లక్ష్మి అధికారిక ప్రకటన చేశారు. కాకినాడ నగరంలోని జేఎన్టీయూకే ఎదురుగా గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఏపీతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.

విద్యార్హతలు: పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఫార్మసీ, ఐటిఐ ఏదో ఒక గ్రూప్ కు చెందిన డిగ్రీ, ఇతర ప్రత్యేక కోర్సులు చేసిన విద్యార్థినీ విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

వయోపరిమితి: ఈ జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. అక్కడే జాబ్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి అభ్యర్థులు వారికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ సెట్లతో హాజరుకావాలని కోరారు.

ఇంకా ఈ జాబ్ మేళాకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా టోల్ ఫ్రీ 86398 46568 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.