IBPS Clerk Recruitment 2025: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల పరీక్షా విధానం, సిలబస్‌ పూర్తి వివరాలు.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ

IBPS Clerk Recruitment 2025: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగనుంది.

IBPS Clerk Recruitment 2025: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల పరీక్షా విధానం, సిలబస్‌ పూర్తి వివరాలు.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ

IBPS Clerk Notification, Exam Pattern, Syllabus Complete Details

Updated On : August 6, 2025 / 11:09 AM IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగనుంది. అయితే, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్లర్క్ పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటారు. విజయం సాధించడం కోసం పగలు, రాత్రి చాలా కష్టపడతారు. ఒక్కోసారి ఎంత కష్టపడినా సరైన గైడెన్స్ లేకపోతే విజయం సాధించడం కష్టం అవుతుంది. కాబట్టి, ఇక్కడ ఐబీపీఎస్ పరీక్షా విధానం, సిలబస్‌పై వివరాలు తెలుసుకుందాం.

ఎంపికా విధానం:

ఐబీపీఎస్ క్లర్క్ నియామకాల ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ఒకటి  ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్. ప్రిలిమ్స్ పరీక్ష అనేది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే నిర్వహిస్తారు. ఇక తరువాత మెయిన్స్ పరీక్ష చాలా కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే తుది జాబితా రూపొందించబడుతుంది.

1.ప్రిలిమ్స్ పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే: 

  • ఈ ప్రిలిమ్స్ పరీక్ష ఆన్‌లైన్ లో జరుగుతుంది. ఇందులో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.
  • ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది 30 మార్కులకు ఉంటుంది. మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. 20 నిమిషాల సమయం ఉంటుంది.
  • రెండవది న్యూమరికల్ ఎబిలిటీ. ఇది 35 మార్కులకు జరుగుతుంది. మొత్తం 30 ప్ర శ్నలు ఉంటాయి. 20 నిమిషాల సమయం ఉంటుంది.
  • మూడవది రీజనింగ్ ఎబిలిటీ. ఇది కూడా 35 మార్కులకు జరుగుతుంది. మొత్తం 30 ప్ర శ్నలు ఉంటాయి. 20 నిమిషాల సమయం ఉంటుంది.
  • మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు, 60 నిమిషాల సమయం. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కట్ చేస్తారు.

2. మెయిన్స్ పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే: 

  • మెయిన్స్ పరీక్ష కూడా ఆన్‌లైన్ లోనే జరుగుతుంది. ఇందులో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి.
  • ఒకటి జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్. మొత్తం 50 ప్రశ్నలు, 50 మార్కులు. 35 నిమిషాల సమయం
  • జనరల్ ఇంగ్లీష్. మొత్తం 40 ప్రశ్నలు, 40 మార్కులు. 35 నిమిషాల సమయం ఉంటుంది.
  • రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్. మొత్తం 50 ప్రశ్నలు, 50 మార్కులు. 45 నిమిషాల సమయం ఉంటుంది.
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మొత్తం 50 ప్రశ్నలు, 50 మార్కులు. 45 నిమిషాల సమయం ఉంటుంది.
  • పరీక్ష మొత్తంలో 190 ప్రశ్నలు, 200 మార్కులు, 160 నిమిషాల సమయం. మెయిన్స్ పరీక్షలో కూడా ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు.

ఐబీపీఎస్ క్లర్క్ సిలబస్ వివరాలు ఇవే:

1.ఇంగ్లీష్ లాంగ్వేజ్:

  • రీడింగ్ కాంప్రహెన్షన్
  • క్లోజ్ టెస్ట్
  • ఫిల్ ఇన్ ది బ్లాంక్స్
  • స్పాటింగ్ ఎర్రర్స్
  • పారా జంబుల్స్
  • వొకాబ్యులరీ, గ్రామర్

2.న్యూమరికల్ ఎబిలిటీ / క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:

  • సింప్లిఫికేషన్ & అప్రాక్సిమేషన్
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్
  • నెంబర్ సిరీస్
  • క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్
  • నిష్పత్తి మరియు అనుపాతం, శాతాలు
  • సమయం, పని , వేగం, దూరం
  • లాభం, నష్టం, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ

3. రీజనింగ్ ఎబిలిటీ:

  • పజిల్స్ , సీటింగ్ అరేంజ్‌మెంట్
  • సిల్లోజిజం
  • కోడింగ్-డీకోడింగ్
  • బ్లడ్ రిలేషన్స్
  • డైరెక్షన్స్
  • ఆల్ఫాన్యూమరిక్ సిరీస్
  • ఇనీక్వాలిటీస్

4.జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్:

  • కరెంట్ అఫైర్స్ (గత 6 నెలలు)
  • బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్స్టా
  • టిక్ జీకే: ముఖ్యమైన తేదీలు, అవార్డులు, దేశాలు,రాజధానులు,కరెన్సీలు, జాతీయ పార్కులు.
  • ప్రభుత్వ పథకాలు

5.కంప్యూటర్ ఆప్టిట్యూడ్:

  • కంప్యూటర్ బేసిక్స్
  • హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్
  • నెట్‌వర్కింగ్
  • ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్
  • షార్ట్‌కట్ కీస్

ఈ విదంగా అభ్యర్థులు ప్రిపరేషన్‌ ను ప్లాన్ చేసుకుంటే తప్పకుండా విజయాన్నీ సాధించవచ్చు.