ICICI Bank Jobs 2025 : ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 12 లక్షల వరకు జీతం.. ఎవరెవరు అప్లయ్ చేసుకోవచ్చంటే?
ICICI Bank Recruitment 2025 : ఐసీఐసీఐ బ్యాంకులో జాబ్స్ ప్రకటన వచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ICICI Bank Jobs 2025
ICICI Bank Recruitment 2025 : ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలు పడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ బ్యాంకులో ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్‌షిప్ పోస్టుకు ప్రాంతాల వారీగా ఖాళీగా ఉన్నాయి.
ప్రత్యేకత ఏమిటంటే.. బ్యాంకులో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 2 లక్షల నుంచి 12 లక్షల జీతం వస్తుంది. ఈ నియామకాలను ప్రధానంగా మధ్యప్రదేశ్ ప్రాంతానికి ప్రకటించారు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ముందుగా ఐసీఐసీఐ వెబ్‌సైట్ (icicicareers.com)లో పూర్తి వివరాలను చెక్ చేయండి.
దరఖాస్తుకు అర్హతలివే :
ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలు మధ్యప్రదేశ్ కు సంబంధించినవి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. దాంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో ఒకటి నుంచి పది ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
ఐసీఐసీఐ లేటెస్ట్ ఉద్యోగాలు :
ఐసీఐసీఐ విడుదల చేసిన ఖాళీలు ఏయే ప్రదేశాలలో ఉన్నాయి. అంటే.. కేవలం మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, చింద్వారా, నర్సింగ్‌పూర్, రత్లాం, గుణ, ఉజ్జయిని, హోషంగాబాద్, విదిష, సత్నా, బుందేల్‌ఖండ్ వంటి నగరాలకు ఈ ఖాళీలు విడుదలయ్యాయి.
ఐసీఐసీఐ రిలేషన్‌షిప్ మేనేజర్.. జీతం ఎంతంటే? :
ఐసీఐసీఐ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుకు ఎంపిక చేసే అభ్యర్థులకు రూ. 2 లక్షల నుంచి 12 లక్షల వరకు జీతం వస్తుంది. వర్క్ విషయానికొస్తే.. రిలేషన్‌షిప్ మేనేజర్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వారికి మార్గనిర్దేశం చేయాలి. దీనితో పాటు, 360-డిగ్రీల బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను చేర్చాల్సి ఉంటుంది.
దాంతో పాటు, పోర్ట్‌ఫోలియో క్వాలిటీని పెంచే పనిని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొడక్టు టీంతో సమన్వయం చేయాల్సి ఉంటుంది. అలాగే, పోర్ట్‌ఫోలియోను నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారులకు మెరుగైన సేవలను కూడా అందించాల్సి ఉంటుంది.