IGCAR జూనియర్ రీసెర్చ్ విభాగాల్లో ఖాళీలు

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 04:59 AM IST
IGCAR జూనియర్ రీసెర్చ్ విభాగాల్లో ఖాళీలు

Updated On : May 1, 2019 / 4:59 AM IST

కల్పకం (తమిళనాడు)లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) 30 జూనియర్ రీసెర్చ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షకు సంబంధిత విభాగంలో MSC, M-TECH, BSC, B-TECH లో 60 శాతం మార్కులతో ఉత్తిర్ణత ఉండాలి. 28 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రీసెర్చ్ విభాగాలు:
ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్.

శిక్షణ ప్రదేశం:
ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ (కల్పకం)-తమిళనాడు.

ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. సైన్స్ విభాగాలకు మాత్రమే రాత పరీక్ష ఉంటూంది. ఇంజనీరింగ్ విభాగాలకు ఉండదు.

ముఖ్యమైన తేదీలు:

పరీక్ష తేది ( సైన్స్ విభాగాలకు) జూన్ 9, 2019 
ఇంటర్వ్యూ తేదీలు (ఇంజనీరింగ్ విభాగాలకు) జూన్ 15-16, 2019
దరఖాస్తు చివరి తేది మే 20, 2019