IIT JAM 2025 : ఐఐటీ జామ్ రిజిస్ట్రేషన్‌కు లాస్ట్ డేట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
IIT JAM 2025 Registration : దేశవ్యాప్తంగా 100 కేంద్రాలలో ఫిబ్రవరి 2, 2025న పరీక్ష జరుగనుంది. ఐఐటీ జామ్ ఫలితాలు మార్చి 16, 2025న ప్రకటిస్తారు.

IIT JAM 2025 Registration Deadline Ends Today
IIT JAM 2025 Registration : ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఢిల్లీ, మాస్టర్స్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (JAM) కోసం రిజిస్ట్రేషన్ అక్టోబర్ 18తో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (JOAPS) ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. 22 ఐఐటీలు, ఇతర భాగస్వామ్య సంస్థలలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc), ఎంఎస్సీపీహెచ్‌డీ కంబైన్డ్ కోర్సులలో ప్రవేశం కోరుకునే వారికి ఈ పోటీ పరీక్ష చాలా కీలకమని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా 100 కేంద్రాలలో ఫిబ్రవరి 2, 2025న పరీక్ష నిర్వహించనుంది. ఐఐటీ జామ్ ఫలితాలు మార్చి 16, 2025న ప్రకటిస్తారు. జామ్ 2025 మొత్తం 7 పరీక్ష పేపర్‌లను కలిగి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 3 రకాల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు (MSQ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు ఉంటాయి.
అర్హత సాధించిన అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీలో సుమారు 3వేల సీట్లకు అర్హులు. అదనపు అర్హతలు అవసరం లేదు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసేటప్పుడు ప్రాథమిక వ్యక్తిగత సమాచారం, విద్యా అర్హతలు, స్టడీ సెంటర్, సిటీ, గుర్తింపు పత్రాలను అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
ఐఐటీ జేఎఎమ్ 2025 రిజిస్ట్రేషన్ చేయాలంటే? :
- అధికారిక సైటు (jam2025.iitd.ac.in)లో JOAPS పోర్టల్‌ని విజిట్ చేయండి.
- మీ వ్యక్తిగత, విద్యా వివరాలను ఎంటర్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
- సిగ్నేచర్ సహా ఫొటోగ్రాఫ్ అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- తద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
- 2025 ఐఐటీ జేఎఎమ్ అప్లికేషన్ రుసుమును చెల్లించండి.
- అందించిన సమాచారాన్ని రివ్యూ చేసి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
జామ్ 2025 స్కోర్‌లు సీసీఎమ్ఎన్ కౌన్సెలింగ్ ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), అనేక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 2వేల సీట్లకు పైగా అడ్మిషన్లను పొందవచ్చు.