Demand for Commerce Courses : కామర్స్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ ! ఎందుకో తెలుసా ?
ఇప్పటివరకూ సీఏ/ సీఎంఏ/ సీఎస్ అర్హత సాధించినవారు పీహెచ్‌డీ చేసేందుకు దేశ ,విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు అనుమతిని నిరాకరిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం యూజీసీ నిర్ణయంతో ఈ కోర్సులు చేసిన వారికి కామర్స్‌లో ఎంకాం, ఎంఫిల్ చేసిన వారిగా గుర్తింపు లభించనుంది.

commerce professional courses
Demand for Commerce Courses : కామర్స్ కోర్సులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. వేగవంతంగా మారుతున్న ఆర్ధిక పరిణామాల నేపధ్యంలో కామర్స్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇంటర్ తరువాత చాలా మంది కామర్స్ కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ముఖ్యకారణం ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉండటమే.
READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం
ఇంటర్ తరువాత కామర్స్ కోర్సులు ;
బీకామ్ ; ఇంటర్ తరువాత చాలా మంది బీకామ్ కోర్సులో చేరుతున్నారు. మూడు సంవత్సరాల ఈ కోర్సుతోపాటుగా స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్ రంగాలకు సర్టిఫికెట్ కోర్సును చేస్తే మంచి ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. ఏంబీఏ, ఎంకామ్ వంటి ఉన్నత చదుదువులను ఈ డిగ్రీతో అభ్యసించవచ్చు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్ , బ్యాంకింగ్ వంటి రంగాల్లో అవకాశాలు పొందవచ్చు. బహుళ జాతి కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందవచ్చు.
బీబీఏ ; ఇంటర్ తరువాత మంచి ఆదర ఉన్న కోర్సుగా బీబీఏని చెప్పవచ్చు. బీబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ ఆర్, హాస్పిటల్ మేనేజ్ మెంట్ వంటి స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి. మూడేళ్ళ కాల వ్యవధిలో వీటిని పూర్తికి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి బ్యాంకింగ్ ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉపాధిఅవకాశాలు లభిస్తాయి.
READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు
బీబీఏ ఎల్ ఎల్ బీ ; బీబీఏ ఎల్ఎల్ బీ ఈ కోర్సు 5సంవత్సరాల కాలం. క్లాట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సొలిసిటర్ గా, కార్పొరేట్ లాయర్ గా, ఫైనాన్స్ మేనేజర్ గా, లీగల్ అడ్వైజర్ గా, మేనేజ్ మెంట్ కన్సలెంట్ గా ఉపాధి పొందవచ్చు.
బీకామ్ ఎల్ ఎల్ బీ ; బీకామ్ ఎల్ ఎల్ బీ అనేది 5సంవత్సరాల వ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్ కోర్సు. దీనిలో న్యాయశాస్త్రం, వ్యాపారానికి అంశాలు కలగలిపి ఉంటాయి. క్లాట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి న్యాయసంబంధిత సంస్ధలు, కార్పొరేట్ కంపెనీలు, ఫార్మా రంగం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉపాధి అవకాలు సొంతం చేసుకోవచ్చు.
ఇవి కాక బీఏ ఎకనామిక్స్, బికామ్ ఆనర్స్ వంటి కామర్స్ కోర్సులు ఉన్నాయి. వాటికి కూడా విద్యార్దుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. వాటిని పూర్తి చేసిన వారికి కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు
సీఏ/ సీఎంఏ/ సీఎస్ చేస్తే పీజీ తో సమానం ;
రానున్న కాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. కామర్స్ కోర్సులు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగం దొరకటమే కాదు. కంపెనీలు మంచి భారీ ప్యాకేజీలను అందుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ -23 నివేదిక సైతం స్పష్టం చేస్తుంది. ఈ ఏడాదిలో డిగ్రీ కోర్సుల్లో చేరేవారిలో అత్యధికులు కామర్స్ కోర్సులవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా సీఏ/ సీఎంఏ/ సీఎస్ వంటి ప్రొఫెసనల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తుంది.
ఇటీవలి యూజీసీ సీఏ/ సీఎంఏ/ సీఎస్ ఉత్తీర్ణులైన వారిని పీజీ చేసినవారితో సమానంగా గుర్తిస్తుండటమే దీనికి కారణం. యూజీసీ నిర్ణయంతో కామర్స్ వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్ధులకు ఉపయోగకరంగా మారింది. సీఏ/ సీఎంఏ/ సీఎస్ కోర్సులను పోస్టు గ్రాడ్యుయేషన్ తో సమానంగా గుర్తింపు ఇవ్వాలని యూజీసీని అనేక సార్లు ఐసీఏఐ, ఐసీఎస్ఐ వంటి సమస్యలు కోరుతూ వస్తుండటంతో యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
READ ALSO : Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం
ఇప్పటివరకూ సీఏ/ సీఎంఏ/ సీఎస్ అర్హత సాధించినవారు పీహెచ్‌డీ చేసేందుకు దేశ ,విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు అనుమతిని నిరాకరిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం యూజీసీ నిర్ణయంతో ఈ కోర్సులు చేసిన వారికి కామర్స్‌లో ఎంకాం, ఎంఫిల్ చేసిన వారిగా గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా పీహెచ్‌డీ చేయడంతోపాటు యూజీసీ నిర్వహించే నెట్, వివిధ రాష్ట్రాలు నిర్వహించే సెట్ లాంటి పరీక్షలకు అర్హతలభించినట్లైంది.
అంతేకాకుండా విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ తదితర కామర్స్ కోర్సులు అభ్యసించడానికి అవకాశం లభిస్తుంది. బహుళజాతి సంస్థల్లో ఉన్నతఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోనే అవకాశం కలుగుతుంది.
యూజీసీ తాజా ప్రకటనతో దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంల్లో సీఏ విద్యార్థులు పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీఏ పూర్తిచేసినవారు యూజీనీ నిర్వహించే నెట్ అర్హత సాధించటం ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు.