Indian Army Recruitment: 12వ తరగతి పాసైతే చాలు.. ఇండియన్ ఆర్మీలో జాబ్.. ఇలా అప్లై చేసుకోండి

90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Indian Army Recruitment: 12వ తరగతి పాసైతే చాలు.. ఇండియన్ ఆర్మీలో జాబ్.. ఇలా అప్లై చేసుకోండి

Indian Army Recruitment

Updated On : June 10, 2025 / 1:52 PM IST

దేశానికి సేవ చేయాలని కోరుకునేవారికిగుడ్ న్యూస్. 90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరీ ముఖ్యంగా ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించన వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. జేఈఈ (మెయిన్) 2025కు హాజరైన అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా మారనుంది.

జూన్ 12న దరఖాస్తు ప్రక్రియ పూర్తి కానుంది. అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. తేదీ 2 జనవరి 2006 నుంచి 1 జనవరి 2009 మధ్యలో ఉండాలి.

అభ్యర్థులు ఏ యూపీఎస్సీ పరీక్ష నుండి కూడా డిబార్ అయ్యి ఉండకూడదు. నేర చరిత్ర ఉండకూడదు(అరెస్ట్ అవ్వకూడదు). కోర్టు ద్వారా దోషిగా నిర్ధారించబడకూడదు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

ముందుగా joinindianarmy.nic.in వెబ్ సైట్ కి వెళ్ళాలి.
హోమ్ పేజీలో ఆఫీసర్స్ ఎంట్రీ అప్లై/లాగిన్‌ పై క్లిక్ చేయాలి.
అక్కడ మీ ప్రాథమిక సమాచారంతో రిజిస్టర్ అవ్వాలి.
తర్వాత అప్లికేషన్ ఫారం నింపాలి.
అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
తరువాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.