చెక్ ఇట్: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 10:26 AM IST
చెక్ ఇట్: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

Updated On : April 24, 2019 / 10:26 AM IST

ఇండియన్ నేవీ చార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లొమా ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:
అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ (NAI) పరిధిలోని డిపోలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డీఆర్‌డీవో ల్యాబ్స్, క్వాసీ మిలిటరీ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత:
సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్).

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.205 చెల్లించాలి. SC, ST, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. 
Also Read : ఇంట‌ర్ అల‌ర్ట్ : రీ-వాల్యూయేషన్, కౌంటింగ్ కు ఇలా అప్లయ్ చేసుకోండి