Unemployment Rate: దేశంలో 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిన నిరుద్యోగం

మన దేశంలో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానటరింగ్ ఇండియన్ ఎకానమీ బుధవారం తెలిపింది. జనవరిలో 7.14 శాతం ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 7.5 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది

Unemployment Rate: దేశంలో 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిన నిరుద్యోగం

India's unemployment rate rose to 7.5 percent

Updated On : March 1, 2023 / 5:00 PM IST

Unemployment Rate: మన దేశంలో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానటరింగ్ ఇండియన్ ఎకానమీ బుధవారం తెలిపింది. జనవరిలో 7.14 శాతం ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 7.5 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. అయితే గత నెలతో పోల్చుకుంటే పట్టణ నిరుద్యోగిత తగ్గింది. జనవరిలో పట్టణ నిరుద్యోగిత 8.55 శాతం ఉండగా ప్రస్తుతం 7.93 శాతంగా ఉంది. ఇక గ్రామీణ నిరుద్యోగిత జనవరిలో 6.48 శాతం ఉండగా ఫిబ్రవరిలో 7.23 శాతానికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది.

Male Chicken Arrest: వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు, తొందరలోనే కోర్టు ముందు హాజరు