IWAI Job Vacancies : ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

IWAI Job Vacancies : ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ

Inland Waterways Authority of India Vacancies

Updated On : November 11, 2022 / 4:55 PM IST

IWAI Job Vacancies : భారత ప్రభుత్వ ఓడరేవుల షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 14 డిప్యూటీ డైరెక్టర్, ఈడీపీ అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్-డి, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లిష్‌,హిందీ టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్న వారు ఎవరైనా డిసెంబర్‌ 17, 2022వ తేదిలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iwai.nic.in/