ISRO Jobs: ఇస్రో షార్ లో ఉద్యోగాలు.. జీతం లక్ష రూపాయలు.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.isro.gov.in/.

ISRO Jobs: ఇస్రో షార్ లో ఉద్యోగాలు.. జీతం లక్ష రూపాయలు.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..

Updated On : October 19, 2025 / 10:34 PM IST

ISRO Jobs: ఇస్రో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ లో ఉద్యోగాలు పడ్డాయి. మొత్తం 141 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో టెక్నీషియన్, డ్రాప్ట్స్ మెన్, ఇతర పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. నవంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎల్ఎస్ సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.isro.gov.in/.

టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఫైర్ మన్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. ఫీజు 750 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ..
https://www.shar.gov.in లేదా https://www.apps.shar.gov.in సైట్ కి వెళ్లి రిజిస్ట్రర్ చేసుకోవాలి.
లాగిన్ అవ్వాలి, అప్లికేషన్ నింపాలి, డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. (నవంబర్ 14లోపు)
తదుపరి వివరాలు అభ్యర్థి రిజిస్ట్రర్డ్ మెయిల్ కి పంపుతారు.

జీతం వివరాలు..
సైంటిస్ట్/ఇంజినీర్ – 56,100 – 1,77,500
టెక్నికల్ అసిస్టెంట్ – 44,900- 1,42,400
సైంటిఫిక్ అసిస్టెంట్ – 44,900 – 1,42,400
లైబ్రరీ అసిస్టెంట్ – 44,900 – 1,42,400
రేడియోగ్రాఫర్ – 25,500 – 81,100
డ్రాఫ్ట్స్ మెన్ – 21,700 – 69,100
నర్స్ – 44900 – 142400