JEE Main 2024 : జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్.. ఈరోజే లాస్ట్ డేట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
JEE Main 2024 : జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఇప్పుడే అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

JEE Main 2024 : Last Date For Registration
JEE Main 2024 Exam Last Date : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) సెషన్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 4, 2024 (మరికొన్నిగంటల్లో)తో ముగిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌లో ఈరోజు రాత్రి 10:50 గంటల లోపు అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫీజులను సమర్పించడానికి చివరి తేదీ ఈరోజు రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే. దరఖాస్తులో ఏదైనా తప్పులను సరిదిద్దేందుకు వ్యవధి మార్చి 6 నుంచి మార్చి 7 వరకు సమయం ఉంటుంది.
ఇప్పటికే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ గడువు మార్చి 2, 2024తో ముగిసింది. పలువురు విద్యార్థులు ఏజెన్సీకి రిక్వెస్ట్ చేయడంతో ఎన్‌టీఏ అప్లికేషన్ గడువు తేదీని మరో రెండు రోజులు పొడిగించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ఇతర టెక్నాలజీ సంస్థలు (CFTI) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశానికి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు.
జేఈఈ (మెయిన్) 2024 సెషన్-1 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ (మెయిన్) 2024 సెషన్ 2 కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోలేకపోయిన అభ్యర్థులు జేఈఈ కోసం లేటెస్టుగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు అందరికి అవకాశం ఉంది.
అభ్యర్థులు మార్చి 7, 2024 రాత్రి 11:50 గంటల వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. మార్చి 7 తర్వాత దరఖాస్తులో ఎలాంటి మార్పులు చేయలేరని గమనించాలి. అదనపు రుసుమును (వర్తించే చోట) సంబంధిత అభ్యర్థి క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే? :
- అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఫుల్ రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
- సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆపై ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించాలి.
- ఆ తర్వాత ప్రింట్ తీసుకోండి.
Read Also : UPSC CSE 2024 : యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎలా అప్లయ్ చేయాలంటే?