Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. జీతం, అర్హత, దరఖాస్తు వివరాలు

Job Mela: కరీంనగర్‌లోని కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్‌లో ఉద్యోగాలు కల్పించుటకు ప్రభుత్వ ఈ సేవ కేంద్రం కాశ్మీర్ గడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. జీతం, అర్హత, దరఖాస్తు వివరాలు

Job Mela At Karimnagar

Updated On : July 17, 2025 / 10:00 AM IST

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కల్పనకు ప్రోత్సహించడం, విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ అందించడం, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లాంటివి చేపడుతున్నాయి. జిల్లాల వారీగా అలాగే స్థానికంగా ఉండే నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో జాబ్ మేళా నిర్వహించనున్నారు అధికారులు. ఈ మేరకు జిల్లా ఉపాధికారి వై. తిరుపతిరావు అధికారిక ప్రకటన చేశారు. ఈ నెల 18 శుక్రవారం రోజున కరీంనగర్‌లోని కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్‌లో ఉద్యోగాలు కల్పించుటకు ప్రభుత్వ ఈ సేవ కేంద్రం కాశ్మీర్ గడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, హెచ్ఆర్, ఆఫీస్ బాయ్‌గా ఆరు పోస్టులని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తప్పకుండా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యార్హత:
10వ తరగతి పాసై డిగ్రీ ఆపై చదువులు చదివిన ప్రతీ ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 19 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

వేతన వివరాలు:
ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16 వేల జీతం ఇస్తారు.

అవసరమయ్యే ధ్రువపత్రాలు:
విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్, రెజ్యుమె, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకొని రావాల్స ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా ఫార్మల్స్ లోనే రావాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం , సందేహాల కోసం 9666100349, 9963177056 ఈ నంబర్స్ ను సంప్రదించవచ్చు.