ESIC : ఈఎస్ఐసీలో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 12, 2022గా నిర్ణయించారు.

Esic Jobs
ESIC : భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఖాళీలను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, మేనేజర్ గ్రేడ్ 2, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, కామర్స్, లా, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్స్ కి ప్రాధాన్యతనిస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21 నుండి 27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 12, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.esic.nic.in సంప్రదించగలరు.